ETV Bharat / state

ATM ROBBER ARREST: ఏటీఎం చోరీయత్నం.. నిందితుడి అరెస్ట్ - మైదుకూరులో ఏటీఎంలో నగదు చోరీయత్నం

కడప జిల్లా మైదుకూరులోని ఎస్బీఐ ఏటీఎంలో జరిగిన చోరీయత్నం కేసులో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీ కెమెరాలోని ఫుటేజీ ఆధారంగా కంసాలి నాగేంద్రాచారిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

ATM ROBBER ARREST
ATM ROBBER ARREST
author img

By

Published : Aug 20, 2021, 4:32 PM IST

కడప జిల్లా మైదుకూరులోని ఏటీఎంలో జరిగిన నగదు చోరీయత్నం కేసులో చాపాడు మండలం విశ్వనాథపురానికి చెందిన కంసాలి నాగేంద్రాచారి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈనెల 16 రాత్రి పట్టణంలో నంద్యాల రోడ్డులోని ఎస్బీఐ ఏటీఎంలో(SBI ATM) నగదును చోరీ చేసేందుకు ప్రయత్నం జరిగింది. దీనికి సంబంధించి వెంకయ్య అనే అధికారి ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సీసీ కెమెరాల ఆధారంగా..

ఏటీఎంలోని నిఘా సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్పీ వెల్లడించారు. కేసును చేధించేందుకు రంగంలోకి దిగిన ఎస్సై మహ్మద్‌రఫి చోరీకియత్నించిన నాగేంద్రాచారి అనే వ్యక్తిని అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. ఏటీఎంలోని నగదును చోరీ చేయాలనే ఉద్ధేశ్యంతోనే యంత్రాన్ని ధ్వంసం చేశారని.. కానీ ఈ ఘటనలో నగదు చోరీ ప్రయత్నం విఫలమైందని వెల్లడించారు.

ఇదీ చదవండి:

VIVEKA MURDER CASE: వివేకా హత్య కేసు.. దస్తగిరి విచారణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.