ETV Bharat / state

'నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా' - కడప జిల్లా నేటి వార్తలు

కడప జిల్లా మంగంపేట గనులను ఏపీఎండీసీ డైరెక్టర్ వెంకట్​రెడ్డి పరిశీలించారు. తన స్వగ్రామంలో పర్యటించన ఆయన... స్థానికంగా ఉన్న పాఠశాలనూ సందర్శించారు. గనుల కారణంగా ఇబ్బందులు పడుతున్న స్థానికుల సమస్యలు తీర్చేందుకు తన వంతు కృషి చేస్తానని వెంకట్​రెడ్డి స్పష్టం చేశారు.

APDMC managing director venkatreddy tour in mangampeta maining
ఏపీఎండీసీ డైరెక్టర్ వెంకట్​రెడ్డి
author img

By

Published : Feb 26, 2021, 10:24 PM IST

కడప జిల్లా ఓబులవారిపల్లె మండలం మంగంపేట బైరైటీస్ గనులను ఏపీఎండీసీ మేనేజింగ్ డైరెక్టర్ వెంకట్​రెడ్డి పరిశీలించారు. తన స్వగ్రామం కొర్లగుంట గ్రామానికి వచ్చిన సందర్భంగా వెంకట్​రెడ్డి... మంగంపేట గనులు, ఏపీఎండీసీ పబ్లిక్ స్కూల్​ను సందర్శించారు. అనంతరం స్థానిక వైకాపా నాయకులతో చర్చించారు. తనకు ఏపీఎండీసీ మేనేజింగ్ డైరెక్టర్ పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వెంకట్​రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మంగంపేట గనులకు సంబంధించి డేంజర్ జోన్ గ్రామాలు, స్థానికులకు ఉద్యోగ కల్పన వంటి అంశాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీఇచ్చారు.

ఇదీచదవండి.

ఉత్తమ వాలంటీర్లకు ఉగాది నుంచి సత్కారాలు..3 కేటగిరీలుగా అర్హుల ఎంపిక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.