రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా కడపలో వైకాపా నేతలు సంబరాలు చేసుకున్నారు. కడపలోని ప్రధాన తపాలా కార్యాలయం వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. జోహార్ వైయస్ఆర్ అంటూ నినాదాలు చేశారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే వృద్ధులకు ప్రతి నెల 2250 రూపాయలు ఇస్తూ సంతకం చేయడం హర్షణీయమన్నారు. సీఎం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని పేర్కొన్నారు. రాజన్న పాలన మరోసారి వచ్చిందని స్పష్టం చేశారు. వైకాపా ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి.