ETV Bharat / state

VIVEKA-HC : 'సాక్షుల వాంగ్మూలాల్ని మా ముందుంచండి'...సీబీఐకి హైకోర్టు ఆదేశం - వివేకా హత్య కేసు న్యూస్

Viveka Murder Case Updates: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సాక్షుల వాంగ్మూలం అందజేయాలని సీబీఐకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దస్తగిరిని సీబీఐ అప్రూవర్‌గా మార్చిందంటూ వివేకా హత్య కేసు ప్రధాన నిందితులు ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్​ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్​పై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది.

వివేకా కేసులో సాక్షుల వాంగ్మూలం అందజేయండి

author img

By

Published : Jan 6, 2022, 8:32 PM IST

Updated : Jan 7, 2022, 3:55 AM IST

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసుకు సంబంధించి దిగువ న్యాయస్థానంలో దాఖలు చేసిన ప్రాథమిక అభియోగపత్రం (ఛార్జిషీట్‌), సీఆర్‌పీసీ సెక్షన్లు 161, 164 కింద సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలు.. ఎంతమంది సాక్షుల్ని విచారించారు? తదితర వివరాలను తమ ముందు ఉంచాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ గురువారం ఈమేరకు ఆదేశాలు జారీచేశారు.

‘సాక్ష్యాలు లేనప్పుడే అప్రూవర్‌గా అనుమతివ్వాలి’

వివేకా హత్యకేసులో నాలుగో నిందితుడు, మృతుని మాజీ డ్రైవర్‌ షేక్‌ దస్తగిరి అప్రూవర్‌గా మారేందుకు అనుమతిస్తూ కడప చీఫ్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌/ప్రిన్సిపల్‌ అసిస్టెంట్‌ సెషన్స్‌ జడ్జి క్షమాభిక్ష ప్రసాదించడాన్ని సవాలు చేస్తూ మొదటి నిందితుడు ఎర్ర గంగిరెడ్డి, మరో నిందితుడు ఉమాశంకర్‌రెడ్డి వేసిన వ్యాజ్యాలు హైకోర్టులో మరోసారి విచారణకు వచ్చాయి. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు బి.ఆదినారాయణరావు, టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు.

దస్తగిరి నిందితుడిగా చెప్పిన విషయాన్ని సీఆర్‌పీసీ సెక్షన్‌ 164 కింద వాంగ్మూలంగా నమోదు చేశారని చెప్పారు. తర్వాత దిగువ కోర్టులో సీబీఐ ప్రాథమిక అభియోగపత్రం దాఖలు చేసిందన్నారు. ఒకసారి వాంగ్మూలం నమోదు చేశాక.. అప్రూవర్‌గా మారాల్సిన అవసరం లేదన్నారు. ఎలాంటి సాక్ష్యాధారాలూ లేనప్పుడే నిందితుడు అప్రూవర్‌గా మారేందుకు వీలుంటుందన్నారు. ప్రస్తుత కేసులో అలాంటి పరిస్థితి లేదని వాదించారు. నేరాన్ని రుజువు చేసేందుకు దస్తగిరి సాక్ష్యమే ఆధారం అని సీబీఐ చెప్పడం లేదని, కడప కోర్టు దస్తగిరికి క్షమాభిక్ష ప్రసాదించడం సీఆర్‌పీసీ నిబంధనలకు విరుద్ధమన్నారు. గతంలో ఈ కేసును విచారించిన పోలీసులు, సిట్‌... దస్తగిరిని నిందితుడిగా పేర్కొనలేదని చెప్పారు. సీబీఐ దర్యాప్తు చేశాకే దస్తగిరి పేరు తెరపైకి వచ్చిందన్నారు. ముందస్తు బెయిలు వచ్చేందుకు సీబీఐ సహకరించిందన్నారు. వెంటనే దస్తగిరి అప్రూవర్‌గా మారేందుకు అనుమతివ్వాలని కడప కోర్టులో పిటిషన్‌ వేసిందని, సీబీఐ తీరు అనుమానాలకు తావిస్తోందని వాదించారు.

సీబీఐ తరఫు న్యాయవాది చెన్నకేశవులు వాదనలు వినిపిస్తూ... దర్యాప్తు వివరాలు, ప్రాథమిక అభియోగపత్రం, వాంగ్మూలాలను కడప కోర్టులో సమర్పించామన్నారు. వాటిని పరిగణనలోకి తీసుకున్నాకే దస్తగిరి అప్రూవర్‌గా మారేందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చిందన్నారు. దస్త్రాలను పిటిషనర్లకు అందించామన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ... ఎంతమంది సాక్షుల్ని విచారించారు, నేర నిరూపణకు ఆ సాక్ష్యాలు సరిపోతాయా? తదితర అంశాలపై స్పష్టత రావాలంటే.. దిగువకోర్టులో దాఖలు చేసిన ప్రాథమిక అభియోగపత్రం, వాంగ్మూలాలను పరిశీలించాల్సి ఉందనే అభిప్రాయం వ్యక్తంచేశారు. ఆ వివరాలను తమ ముందు ఉంచాలని సీబీఐని ఆదేశించారు.

అంతకుముందు దస్తగిరి తరఫు న్యాయవాది గూడపాటి వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ.. అప్రూవర్‌గా మారేందుకు అనుమతివ్వడాన్ని పిటిషనర్లు సవాలు చేయడానికి వీల్లేదన్నారు. నేర ఘటనకు సంబంధించిన లోతైన వివరాలను పిటిషనర్‌ సీబీఐకి చెప్పారన్నారు. దిగువ కోర్టులో విచారణ(క్రాస్‌ ఎగ్జామినేషన్‌) సందర్భంగా ఇవ్వబోయే వాంగ్మూలంపై అభ్యంతరం ఉంటేనే పిటిషనర్లు సవాలు చేసుకోవాలి తప్ప.. అప్రూవర్‌గా మారడాన్ని సవాలు చేయలేరన్నారు.

ఇదీ చదవండి

Last Updated : Jan 7, 2022, 3:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.