ఎన్జీవోస్ మాజీ అధ్యక్షుడు అశోక్బాబు చేసిన తప్పిదాల వల్ల ప్రభుత్వ ఉద్యోగులు సమస్యలను ఎదుర్కొంటున్నారని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అస్కార్ రావు కడపలో ఆరోపించారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులందరూ ఉద్యోగ సంఘాలపై ఆగ్రహంతో ఉన్నారని పేర్కొన్నారు. చివరకు మా సంఘంపై కూడా ఉద్యోగులందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ పెండింగ్లో ఉన్న బిల్లులను సాధ్యమైనంత తొందరగా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులపై అధిక భారాన్ని తగ్గించాలని కోరారు. కొంతమంది ఉన్నతాధికారుల వల్ల ఉద్యోగులందరికీ చెడ్డపేరు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి మంచివాారైనా..అధికారులు సక్రమంగా వ్యవహరించడం లేదని ఆయన విమర్శించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై భవిష్యత్తులో ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి. పెళ్లి కోసం హోర్డింగ్పైకి ఎక్కేసిన బాలిక