ETV Bharat / state

6న కడపలో పర్యటించనున్న సీఎం జగన్ - ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కడప పర్యటన వివరాలు

AP CM YS Jagan To Visit Kadapa: ఈనెల 6వ తేదీన సీఎం వైఎస్ జగన్ కడపలో పర్యటించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. కడప అమీన్ పీర్ దర్గాలో జరిగే పెద్ద ఉర్సు ఉత్సవాలతో పాటు.. ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌ దుగ్గాయపల్లె మల్లిఖార్జునరెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌లో జగన్ పాల్గొంటారని అధికారులు తెలిపారు.

కడపలో పర్యటించనున్న సీఎం జగన్
AP CM YS Jagan
author img

By

Published : Dec 4, 2022, 6:47 PM IST

YS Jagan Kadapa Tour: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 6న కడపలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం, 11.15 గంటలకు కడప ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. 11.40 గంటలకు కడప అమీన్‌ పీర్‌ దర్గాలో జరగనున్న పెద్ద ఉర్సు ఉత్సవాలలో పాల్గొంటారు. 12.25 గంటలకు కడప మాధవి కన్వెన్షన్‌ సెంటర్‌లో ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌ దుగ్గాయపల్లె మల్లిఖార్జునరెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు కడప ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి 2.40 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారని అధికార వర్గాలు వెల్లడించాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.