కడపలో రెండో గాంధీ విగ్రహం వద్ద ఉన్న విద్యుత్ నియంత్రికకు రక్షణ కంచె లేకపోవడంతో పశువులు మేత కోసం వెళ్తూ మృత్యువాత పడుతున్నాయి. తాజాగా రెండు ఆవులు మేత కోసం వెళ్తూ పొరపాటున విద్యుత్ నియంత్రిక వద్దకు వెళ్లాయి. ఈ క్రమంలో విద్యుత్ ఘాతానికి గురై మృత్యువాత పడ్డాయి. ఇలాంటి ఘటనలు జరగకుండా విద్యుత్ నియంత్రిక చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని స్థానికులు అధికారులను కోరుతుననారు.
ఇదీ చదవండి: 'మహమ్మారి'పై భయం వీడితేనే జయం