కేంద్ర ఎన్నికల సంఘం నియంతృత్వ వైఖరి సమంజసం కాదని పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు. వీవీ ప్యాట్ రసీదులు లెక్కిస్తే నష్టమేంటని ప్రశ్నించారు. కడప జిల్లా వేంపల్లిలో తన స్వగృహంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన... దేశంలో 23 రాజకీయ పార్టీలు ఈవీంలను కాకుండా బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపాలని కోరగా.. కేంద్ర ఎన్నికల సంఘం నియంతృత్వ వైఖరి ప్రదర్శించడం దురదృష్టకరమన్నారు. ఈవీఎంలపై అనుమానాలు ఉన్నపుడు బ్యాలెట్ ద్వారా లెక్కించవచ్చు కదా అని ప్రశ్నించారు. 1952 నుంచి 2004 వరకు లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలోనే జరిగాయని.. 24 గంటల్లో ఫలితాలు ప్రకటించేవారని గుర్తు చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిపినపుడు, సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలు ఎందుకు వాడుతున్నారని ప్రశ్నించారు. వీవీ ప్యాట్లు లెక్కించనపుడు.. ఈవీఎంలు ఎందుకు ప్రవేశపెట్టారని అన్నారు.
వీవీ ప్యాట్లు లెక్కించనపుడు.. ఈవీఎంలు ఎందుకు?
వీవీ ప్యాట్ రసీదులు లెక్కించనపుడు ఈవీఎంలు ఎందుకు ప్రవేశపెట్టారని పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి ప్రశ్నించారు. కేంద్ర ఎన్నికల సంఘం నియంతృత్వ వైఖరి సమజసం కాదని ఆయన అన్నారు.