రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై.. అన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజా రామిరెడ్డి పెదవి విరిచారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చుట్టూ ఉండే నాయకుల వల్లే ఆయనకు భవిష్యత్తులో సమస్యలు తలెత్తుతాయని స్పష్టం చేశారు. జగన్ ప్రజా సంక్షేమ పాలన అందించడం లేదని ఆగ్రహించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి మీద ఉన్న ప్రేమతో జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేసి గెలిపిస్తే.. అధికారాన్ని సీఎం జగన్ తన వ్యక్తిగత కక్షలకు వాడుకుంటున్నారని విమర్శించారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించాక ముందే.. అన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించామని గుర్తు చేశారు. అయినప్పటికీ తమ పార్టీ పేరును జగన్ వాడుకున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి తన పంథాను మార్చుకుని ప్రజా రంజకమైన పాలన అందించాలని కోరారు.