ETV Bharat / state

అంగన్​వాడీల్లో.. ''పోషకలోపాలు'' - kadapa

కడప జిల్లా ప్రొద్దుటూరు పరిధిలోని అంగన్​వాడీ కేంద్రాలు.. గర్భిణులు, బాలింతల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం పోషకాహారం అందక లబ్ధిదారులు అటువైపు వెళ్లడమే మానేస్తున్నారు.

అంగన్​వాడీ కేంద్రం
author img

By

Published : Feb 17, 2019, 8:02 PM IST

అంగన్​వాడీ కేంద్రం
గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార సమస్యలు రాకుండా చూడాలన్నదే అంగన్​వాడీ కేంద్రాల ఏర్పాటు లక్ష్యం. కడప జిల్లాలో ఇందుకు వాస్తవ విరుద్ధమైన పరిస్థితి ఉంది. జిల్లాలోని ప్రొద్దుటూరు పరిధిలోనే 524 అంగన్​వాడీ కేంద్రాలు ఉన్నాయి. 6 నెలల నుంచి 6 ఏళ్లలోపు చిన్నారులు 36 వేల మంది.. గర్భిణులు, బాలింతలు కలిపి మరో 7 వేల మంది వీటితో లబ్ధి పొందాల్సి ఉంది. వీరి కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. అయినా.. ఆశించిన ఫలితం కనిపించడం లేదు.
undefined

అంగన్​వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు రోజుకో కోడిగుడ్డు.. 3 నుంచి ఆరేళ్లలోపు పిల్లలకు వారానికి 4 గుడ్ల చొప్పున ఇవ్వాలి. ఈ కేంద్రాలకు రాని మూడేళ్లలోపు చిన్నారులకు నెలకు 8 గుడ్లను ఇంటికి పంచించాలి. కానీ... 3 నెలల నుంచి ఆ పరిస్థితే లేదు. అన్నం, ఆకుకూరలతోనే ఆహారం పెడుతున్న కారణంగా.. లబ్ధిదారులు అటువైపే వెళ్లడం లేదు.

డిసెంబరులో 2 సార్లు, జనవరిలో ఒక్కసారే గుత్తేదార్లు గుడ్లు సరఫరా చేశారు. ఉన్నతాధికారులు సరిగా స్పందించకపోవడమే ఈ సమస్యకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

ప్రొద్దుటూరు పరిధిలోనే కాదు. కడప జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల అంగన్​వాడీ కేంద్రాల్లో ఇదే సమస్య లబ్ధిదారులను వేధిస్తోంది.

Intro:ap_cdp_41_17_anganwadilaku_andani_gudlu_pkg_g3
place: prodduturu
reporter: b.madhusudhan (7989478800)

గమనిక దీనికి సంబంధించిన స్క్రిప్టు ఎఫ్ టి పి ద్వారా పంపడమైనది గమనించగలరు.

Body:a

Conclusion:a

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.