కడప జిల్లా రాజంపేట సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ మహిళలు నిరసన దీక్ష చేపట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉద్యోగులకు వేతనాలు రూ. 25 వేల ఇవ్వాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రవికుమార్ కోరారు. ఉద్యోగ నెపం చూపి అంగన్వాడీలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఏడాదిన్నరగా పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే అంగన్వాడీ కేంద్రాలకు చౌక దుకాణాల ద్వారా సరుకులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి :