కడప జిల్లా రాజంపేట డివిజన్ పరిధిలోని 17 మండలాల్లో ఇళ్ల స్థలాల పంపిణీకి 500 ఎకరాల భూమిని సిద్ధం చేసినట్లు ఆర్డీవో ధర్మచంద్రారెడ్డి తెలిపారు. చాలా ప్రాంతాల్లో ఇళ్ల స్థలాల పంపిణీకి భూసేకరణ చేశారని, రాజంపేట డివిజన్లో మాత్రం ప్రభుత్వంపై ఒక్క రూపాయి భారం పడకుండా ప్రభుత్వ భూమిని గుర్తించామన్నారు. డివిజన్లోని 17 మండలాల పరిధిలో 8645 మంది లబ్ధిదారులకు 340.575 ఎకరాల భూమిని, రాజంపేట, బద్వేలు మున్సిపాలిటీల్లో 5901 మంది లబ్ధిదారులకు 167 ఎకరాల భూమిని గుర్తించామని తెలిపారు. వీటికి సంబంధించి లే అవుట్ వేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయా స్థలాల్లో లబ్ధిదారుల సమాచార సూచిక బోర్డులను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
ఇవీ చూడండి...