ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలైన నవరత్నాలను అమలు పరిచే విధంగా అధికారులు, నాయకులు కృషి చేయాలని ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా అన్నారు. జగన్ అవినీతిరహిత పాలన కోసం కృషి చేస్తున్నారని, దానికి అందరూ సహకరించాలని కోరారు. జడ్పీ ఛైర్మన్ గూడూరు రవి ఆధ్వర్యంలో నిర్వహించిన కడప జడ్పీ 18వ జడ్పీ చివరి సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రజలకు సంబంధించి 97 అంశాలపై అధికారులు చర్చించారు. ముఖ్యంగా తాగునీరు, సాగునీటిపై ఎక్కువ సమయం చర్చ జరిగింది. ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి పలు సమస్యలను తీసుకెళ్లారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని ప్రజలకు అందించాలన్నారు. కలెక్టరు హరికిరణ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రికి ఏ ఆలోచన వచ్చినా.. తొలుత కడప జిల్లా నుంచే ప్రారంభిస్తారని చెప్పారు. అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు జీతాలు పెంచారని తెలిపారు. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా పని చేయాలని కలెక్టర్ కోరారు. ఏ శాఖలో తప్పిదం జరిగితే ఆ శాఖ హెచ్‌వోడీపై ప్రభావం ఉంటుందని, హెచ్‌వోడీ తప్పు చేస్తే తనపై చర్యలుంటాయని కలెక్టరు చెప్పారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి, జడ్పీ ఛైర్మన్, జడ్పీటీసీలు, ఎంపీటీసీలను సన్మానించారు.
'నవరత్నాల అమలుకు అధికారులు సహకరించాలి' - amzaad basha
ముఖ్యమంత్రి ఆశయాల సాధనకు అధికారులు తమ వంతు సాయం అందించాలని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా కోరారు.