అవసరమైతే పరిశీలిస్తాం: బొత్స
రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే ఎన్డీఏలో చేరే అంశాన్ని పరిశీలిస్తామని... ఎవరినైనా గడ్డం పట్టుకుని బతిమిలాడే స్థాయికైనా దిగుతామని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. భాజపాతో తాము అంటిపెట్టుకుని ఉండటం లేదని.. అలాగని వారికి దూరంగానూ లేమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో అనవసరంగా ఎందుకు ఘర్షణ పడాలని అన్నారు.
అసలు చేరే ప్రసక్తే లేదు: అంజద్ బాషా
వైకాపా ప్రభుత్వం ఎన్డీఏలో చేరే ప్రసక్తే లేదని ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో కావాలనే.. అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. 2011 నుంచి జగన్మోహన్ రెడ్డికి భాజపా రంగు పులిమేందుకు అనేకమంది పార్టీ నాయకులు ప్రయత్నించారని తెలిపారు. వైకాపా లౌకిక పార్టీ అని పేర్కొన్నారు. భాజపాతో జత కట్టే దౌర్భాగ్య పరిస్థితి తమ ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పారు.
ఇదీ చదవండి: 'రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరినైనా గడ్డం పట్టుకుని బతిమిలాడుతాం'