కడప జిల్లా యర్రగుంట్లకు చెందిన అంబటి కృష్ణారెడ్డిని.. రాష్ట్ర ప్రభుత్వం కీలక పదవిలో నియమించింది. వ్యవసాయ రంగ సలహాదారుగా ఆయనకు బాధ్యతలు అప్పగించింది. నెలకు రూ.14,000 వేతనాన్ని ప్రభుత్వం అందించనుంది. అలవెన్సుల కింద రూ.15,000 ఇస్తారు. సొంత కారు ఉంటే పెట్రోల్ కోసం నెలకు రూ.30,000 చెల్లించనుంది. ఇంటి అద్దెకు నెలకు రూ.లక్ష, మంత్రులకు ఎలాంటి మెడికల్ రీయింబర్స్ ఉంటాయో అలాంటి సదుపాయాలు, సెక్యూరిటీ నియామకం కోసం నెలకు రూ.25,000 చెల్లించనుంది. ఇల్లు ఊడ్చే వారికి నెలకు రూ.6000 ఇస్తారు. అంబటి కృష్ణారెడ్డికి కారు కొనుక్కోవడానికి రూ.10 లక్షలు లోన్ లేదా అడ్వాన్స్‌గా ప్రభుత్వం ఇవ్వనుంది.
ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్ కోసం రూ.50,000, ఫర్నీచర్ కోసం రూ.3,00,000, వంట సామగ్రికి రూ.1,50,000 లోన్ అందించనున్నారు. అంబటి కృష్ణారెడ్డికి ప్రైవేట్ సెక్రటరీ (1), అడిషనల్ పీఏ (1), బయటి నుంచి మరో పీఏ (1), ఆఫీసు సబార్డినేట్స్ (3), జామేదార్ (1), అదనపు డ్రైవర్ (1), డ్రైవర్ (1) చొప్పున సిబ్బందిని కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలో పేర్కొన్నట్టు సమాచారం.
ఇదీ చదవండి: