ETV Bharat / state

'అక్రమ కట్టడాలను తొలగించకపోవడంతోనే నివాసాల్లోకి నీరు' - కడపలో అఖిలపక్షం నేతల రౌండ్ టేబుల్ సమావేశం వార్తలు

కడప బుగ్గవంక వరద ప్రవాహానికి కారకులైన అధికారులను సస్పెండ్ చేయాలని కడప అఖిలపక్ష నాయకులు హరిప్రసాద్ ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. బుగ్గవంక జల సమాధికి బాధ్యులు ఎవరు అనే అంశంపై నేతలు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు.

all party leaders   Round table meeting   at kadapa
కడపలో అఖిలపక్షం నేతల రౌండ్ టేబుల్ సమావేశం
author img

By

Published : Nov 29, 2020, 5:40 PM IST

సీఎం జగన్ అమరావతిలో ఉన్న కట్టడాలను తొలగించడం కాదని.. ఆయన సొంత జిల్లాలో ఉన్న అక్రమ కట్టడాలను తొలగించాలని కడపలో అఖిలపక్షం నేతలు ఎద్దేవా చేశారు. బుగ్గవంక జల సమాధికి బాధ్యులు ఎవరు అనే అంశంపై అఖిలపక్షం నేతలు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. పరివాహక ప్రాంతాల చుట్టూ ఉన్న అక్రమ కట్టడాలను తొలగించకపోవడంతోనే నీరు నివాసాల్లోకి వచ్చాయని పేర్కొన్నారు. కనీసం ఎలాంటి హెచ్చరికలు జారీ చేయకపోవడంతోనే సమస్య తలెత్తిందని వారు ఆరోపించారు.

బుగ్గవంక పరివాహక చుట్టూ సగం వరకు రక్షణ గోడ నిర్మించి మిగిలిన ప్రాంతాన్ని అలాగే వదిలేయడంతోనే నీరంతా నివాసాల్లోకి దూసుకొచ్చాయి పేర్కొన్నారు. అధికారులు వరద బాధితులకు సహాయం అందించి రక్షణ గోడ నిర్మించాలని డిమాండ్ చేశారు. లేదంటే అఖిలపక్షం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చూడండి.

కార్తిక పౌర్ణమి సందర్భంగా సముద్రంలో స్నానాలు నిషేధం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.