ETV Bharat / state

దేవాదాయశాఖ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో అక్షరదీవెన - కడప

కడప జిల్లా రాజంపేట ఆంజనేయ స్వామి ఆలయంలో 'అక్షర దీవెన' కార్యక్రమం వైభవంగా జరిగింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

అక్షరాభ్యాసం చేయిస్తున్న దేవాదాయ శాఖ సహాయ కమీషనర్
author img

By

Published : Jul 5, 2019, 4:56 PM IST

ఆంజనేయస్వామి ఆలయంలో అక్షరదీవెన కార్యక్రమం

కడప జిల్లా రాజంపేటలో.. చిన్నారులతో దేవాదాయ ధర్మాదాయ శాఖ అక్షరాలు దిద్దించింది. ఈ కార్యక్రమంలో భాగంగా సరస్వతీ దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు, యాగాన్ని నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శంకర్ బాలాజీ పిల్లలకు.. వారి తల్లిదండ్రుల సమక్షంలో అక్షరాభ్యాసం చేయించారు. రాజంపేట పట్టణంలోని వివిధ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతిలో చేరిన పిల్లలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శంకర్ బాలాజీ మాట్లాడుతూ ఏటా జిల్లాలోని ప్రముఖ ఆలయాలలో అక్షర దీవెన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు . ఇప్పటికే కడప రాయచోటి వంటి ప్రాంతాల్లో నిర్వహించామని ఇలాగే జిల్లా అంతటా ఆలయాల్లో సామూహిక అక్షరాభ్యాసం శాస్త్రోక్తంగా నిర్వహిస్తామన్నారు.

ఇదీ చూడండి

బతికుండగానే మరణ ధ్రువీకరణపత్రం..!

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231

Body:ap_rjy_31_13_murder_p v raju_av_c4 ------------------- సర్ విజువల్స్ ftp ద్వారా పంపించాను. పరిశీలించగలరు. ------------------- తూర్పుగోదావరి జిల్లా తుని మండలం ఎర్ర కోనేరు వద్ద జాతీయ రహదారి సమీపంలో తుప్పల్లో యువకుడి మృత దేహం అనుమానాస్పద స్థితిలో లభ్యమైంది. మండలం లోని టి. వెంకటాపురం గ్రామానికి చెందిన నగేష్ గా గుర్తించారు. బుధవారం రాత్రి తన స్నేహితుడు తో కలిసి బయటకు వెళ్లిన నగేష్ రాత్రి ఇంటికి రాకపోవడం తో కుటుంబ సభ్యులు వేతకగా తుప్పల్లో విగత జీవిగా కనిపించాడు. ఒంటిపై గాయాలు ఉండటంతో హత్య గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, స్నేహితుడుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని సీఐ శ్రీనివాస్ తెలిపారు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.