సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు కర్మాగారం నిర్మించాలని కోరుతూ కడపలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ఏఐవైఎఫ్ నాయకులు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలో భాగంగా కడపలో ఉక్కు కర్మాగారం నిర్మించాలని ఏఐవైఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఉక్కు కర్మాగారం నిర్మించాలంటూ నినాదాలు చేశారు. వెనకబడిన రాయలసీమ ప్రాంతంలో ఉక్కు కర్మాగారం నిర్మించడం వల్ల ఎంతో ఊరట లభిస్తుందని తెలిపారు. సెయిల్ ఆధ్వర్యంలోనే కర్మాగారం నిర్మించాలని... లేదంటే ఉద్యమాలు చేస్తామని నాయకులు హెచ్చరించారు.
ఇదీచూడండి.సోమశిల వెనక జలాలతో ప్రజల ఇక్కట్లు