రెండు నెలల అనంతరం చెన్నై నుంచి కడప విమానాశ్రయానికి ప్రయాణికులతో విమానం చేరుకుంది. వారందరికీ విమానాశ్రయంలో పోలీసు, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు. విమానంలో ప్రయాణించిన 22 మందిని వారం రోజులపాటు క్వారంటైన్‌కు తరలించారు. అక్కడ పూర్తి స్థాయిలో పరీక్ష నిర్వహించి నెగిటివ్ వచ్చినవారిని నివాసాలకు పంపించారు. వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు పలు సూచనలు చేశారు. ఎవరైనా క్వారంటైన్ నుంచి బయటికి వస్తే వారిపై కేసు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.
ఇవీ చూడండి...