సునీత, శంకర్ అనే వ్యక్తుల మాటలు నమ్మి... ఆదిలాబాద్‌కు చెందిన 14 ఏళ్ల బాలిక వారితో వెళ్లేందుకు సిద్ధపడింది. రైల్లో ప్రయాణిస్తుండగా ఆ బాలికకు అనుమానమొచ్చింది. కడప జిల్లా నందలూరు రైల్వేస్టేషన్లో పోలీసులను ఆశ్రయించింది. వారు ఆ బాలికను రాజంపేట పట్టణంలోని బాలసదన్‌కు తరలించారు. శంకర్, సునీత ఇద్దరూ బంధువులేనని బాధిత బాలిక చెప్పింది. కానీ... తనను ఎక్కడికి తీసుకెళ్లేది చెప్పలేదని వివరించింది. భయమేసి నందలూరు రైల్వేస్టేషన్లో దిగి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆ బాలిక వెల్లడించింది.
ఇవీ చూడండి: