కడప జిల్లా రైల్వేకోడూరు మండలం ఉప్పరపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. కారును లారీ ఢీకొన్న ఘటనలో డ్రైవర్‌తో పాటు మహిళ మృతిచెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. కారు తిరుపతి నుంచి రైల్వేకోడూరుకు వస్తుండగా.. ఉప్పరపల్లి సమీపంలో లారీ ఢీకొంది. ఈ దుర్ఘటనలో డ్రైవర్ రాజా, నాగమణి అనే మహళ అక్కడికక్కడే చనిపోయారు. మృతదేహాలను శవపరీక్ష కోసం రాజంపేటకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి...