Van crashes into a house: కడప జిల్లా సీకే దిన్నె మండలం మద్దిమడుగు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో నలుగురు గ్రామస్తులు దుర్మరణం చెందారు. కడప-బెంగళూరు జాతీయ రహదారిలో ఈ ప్రమాదం సంభవించింది. జాతీయ రహదారి పక్కనే ఉన్న మద్దిమడుగు గ్రామస్తులు ఇంటిముందు మంచంపై కూర్చొని ఉండగా.. కడప నుంచి రాయచోటికి వెళ్లే జిప్సీ వ్యాను వేగంగా వారిపైకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో కొండయ్య, అమ్ములు దంపతులతోపాటు.. లక్ష్మీదేవి, దేవి అనే నలుగురు చనిపోయారు. ఘటనా స్థలంలో కొండయ్య, లక్ష్మీదేవి చనిపోగా మిగిలిన ఇద్దరు కడప రిమ్స్‌కు తరలిస్తుండగా మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రవాణాశాఖ అధికారులు ప్రమాదం జరిగిన తీరుపై ఆరాతీశారు. జిప్సీ వ్యాన్ డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.
పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కడప రిమ్స్‌కు తరలించారు. ఒకేసారి నలుగురు మృతిచెందడంతో మద్దిమడుగు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:
husband murdered his wife : కట్టుకున్న భార్యను కడతేర్చిన భర్త