కడప జిల్లా మైదుకూరు మండలంలోని గొల్లపల్లి వద్ద అఖిల భారత విద్యార్థి పరిషత్ నాయకులు, విద్యార్థులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. కర్నూలు - చిత్తూరు జాతీయ రహదారి నుంచి వెంకటాపురం గొల్లపల్లె లింగాలదిన్నె మీదుగా వనిపెంట వరకు ఉన్న రహదారి అధ్వానంగా ఉందని... దీంతో పాదచారుల, వాహనదారుల రాకపోకలకు కష్టంగా మారుతుందని నిరసన తెలిపారు. రహదారిని అభివృద్ధి చేసి ప్రజల కష్టాలు తీర్చాలని వారు కోరారు.
ఇదీ చదవండి: ఆర్టీపీపీలో కొనసాగుతున్న విద్యుత్ ఉద్యోగుల నిరసన