ETV Bharat / state

కత్తితో దాడి... యువకుడికి గాయాలు - young man was injured in a sword attack in kdapa news

కడప జిల్లా జమ్మలమడుగులో ఇద్దరి యువకుల మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

A young man was injured in a sword attack in Jammalamadugu, Kadapa district
కత్తితో దాడి... యువకుడికి గాయాలు...
author img

By

Published : Jan 25, 2021, 6:03 AM IST

కడప జిల్లా జమ్మలమడుగులో ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘర్షణలో.. ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. తాడిపత్రిలోని ఫొటో స్టూడియోలో మున్నా, తేజ అనే ఇద్దరు వ్యక్తులు పని చేస్తున్నారు. గణేష్ అనే మరో యువకుడు అదే స్టూడియోలో కొత్తగా పనిలో చేరాడు.

తేజ, గణేష్ మధ్య వాగ్వాదం జరిగింది. తేజ తన వాహనంలో ఉన్న కత్తి తీసుకుని.. గణేష్ పై దాడి చేశాడు. ఈ ఘటనలో గణేష్ చేతికి గాయమైంది. అతనికి జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు మున్నా, తేజ పై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

పులివెందులలో ఇన్​సైడ్ ట్రేడింగ్: ఎమ్మెల్సీ బీటెక్ రవి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.