కడప జిల్లా పోరుమామిళ్లలోని ఎస్టీ కాలనీలో దారుణం జరిగింది. భర్త మద్యానికి బానిసయ్యాడని మనస్తాపం చెందిన భార్య.. పురుగుల మందు తాగి తన ముగ్గురు పిల్లలకు పట్టించింది. గమనించిన స్థానికులు వారిని చికిత్స నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు.
పోరుమామిళ్ల ఎస్టీ కాలనీకి చెందిన సుధీర్ బాబు, పుష్పలత భార్యభర్తలు. మద్యానికి బానిసైన సుధీర్ బాబు.. ప్రతిరోజూ తాగొచ్చి భార్య, పిల్లలను హింసించేవాడు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన పుష్పలత పురుగుల మందు తాగి.. పిల్లలకు పట్టించింది.
ఇదీ చూడండి..