అగ్రవర్ణాలకు కేంద్రం అమలు పరిచిన 10 శాతం రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పవన్ కుమార్ డిమాండ్ చేశారు.ఇందుకు నిరసనగా కడపలో బీజేవైఎం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ, పోస్టుకార్డుల ఉద్యమాన్ని చేపట్టారు. కేంద్రం అమలు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అమలుపరచక పోవడం దారుణమన్నారు. అగ్రవర్ణాలలో ఉన్న అనేకమంది పేదలు ఉద్యోగాల్లేక నిరుద్యోగులుగా జీవితాలను కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రవర్ణాలపై సీఎంకి ఎందుకింత కక్ష ఉందని ప్రశ్నించారు. వెంటనే 10 శాతం రిజర్వేషన్లను అమలు చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చదవండి