ETV Bharat / state

గండికోట ముంపువాసుల సమస్యపై హైకోర్టులో పిల్ - ఏపీ హైకోర్టు తాజా వార్తలు

గండికోట జలాశయం ముంపువాసుల సమస్య హైకోర్టుకు చేరింది. బాధితులకు పరిహారం, పునరావాసం కల్పించకుండా ఇళ్లు ఖాళీ చేయాలని కడప జిల్లా యంత్రాంగం ఆదేశించటంతో.... జనసేన పార్టీ నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ముగ్గురు బాధితులు కూడా రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం బుధవారం విచారణ చేపట్టింది.

ap high court
ap high court
author img

By

Published : Sep 23, 2020, 10:44 PM IST

కడప జిల్లా కొండాపురం మండలం గండికోట జలాశయం ముంపు బాధితుల సమస్యపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై బుధవారం హైకోర్టు విచారణ చేపట్టింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన న్యాయస్థానం విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది.

గండికోట జలాశయంలో ఈసారి 23 టీఎంసీల నీరు నిల్వ చేయాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇటీవల ఆదేశించటంతో... జిల్లా యంత్రాంగం ఆఘమేఘాల మీద ఆ దిశగా చర్యలు చేపట్టింది. గండికోట ముంపు కింద 7 గ్రామాల్లో ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయల పరిహారం, పునరావాసం కింద 7 లక్షల రూపాయలను చెల్లించకుండా ఉన్న ఫలంగా ఇళ్లు ఖాళీ చేయాలని ఆదేశించారు. దీనిని నిరసిస్తూ 20 రోజుల నుంచి తాళ్ల ప్రొద్దుటూరు గ్రామస్థులు ఆందోళన చేపడుతున్నారు. ఆ గ్రామాన్ని గండికోట వెనకజలాలు చుట్టుముట్టాయి. కానీ అధికార యంత్రాంగం చలించటం లేదు. ప్రస్తుతం గండికోటలో 13 టీఎంసీలకు పైగానే నీరు నిల్వ చేశారు. ఇళ్లలోకి విష పురుగులు వస్తున్నాయని... కనీసం ఆరు నెలల గడువు ఇస్తే ఇళ్లు ఖాళీ చేస్తామని తాళ్లప్రొద్దుటూరు వాసులు చెబుతున్నా అధికారులు వినడం లేదు.

ముంపువాసులకు విపక్షాలు మద్దతు తెలిపాయి. ఈ క్రమంలో ఆ గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. తమకు పరిహారం ఇవ్వకుండా, పునరావాసం కల్పించకుండా ఇళ్లు ఖాళీ చేయించాలని చెబుతున్నారని కోర్టుకు విన్నవించారు. ఇదే సమయంలో జనసేన పార్టీకి చెందిన పర్యావరణ పరిపరిక్షణ, మానవ హక్కుల వేదిక కార్యకర్త బొలిశెట్టి సత్యనారాయణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. 2013 భూసేకరణ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించి తాళ్ల ప్రొద్దుటూరులోని ఎస్సీ, బీసీ కాలనీల్లోకి నీళ్లు వదిలారని పిటిషన్ లో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఉల్లంఘించి బాధితులకు పరిహారం, పునరావాసం కల్పించకుండా నిర్లక్ష్యం చేశారని వివరిస్తూ బాధితుల జాబితాను కోర్టుకు సమర్పించారు.

ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారించిన న్యాయస్థానం... ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయడానికి విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.