కట్టుకున్న భార్య పట్ల యముడిలా మారాడు భర్త. రోకలి బండతో భార్య తలపై మోది చంపేశాడు. కడప జిల్లా పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న బ్రాహ్మణపల్లె గ్రామానికి చెందిన అంకాలమ్మ, పెద్ద గంగిరెడ్డి భార్యభర్తలు. వీరూ తరచూ గొడవ పడుతుండేవారు. ఆ కలహాలు తారా స్థాయికి చేరటంతో భార్య అంకాలమ్మ(53)ను పెద్ద గంగిరెడ్డి రోకలి బండతో కొట్టి చంపాడు. అనంతరం ఇంటి నుంచి పరారయ్యాడు. చివరకు గంగిరెడ్డి పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని...త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని పులివెందుల పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి