ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి - కడప జిల్లాలో రోడ్డు ప్రమాదాలు

బస్సు కింద పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. స్థానిక వివేకానంద నగర్​కు చెందిన రామచంద్రారెడ్డి కోటిరెడ్డి కూడలి సమీపంలో ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. ఆ సమయంలో అటుగా వస్తోన్న ఆర్టీసీ బస్సు అతనిపై నుంచి వెళ్లి అతను అక్కడికక్కడే చనిపోయాడు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
author img

By

Published : Sep 27, 2019, 11:59 PM IST

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

కడప జిల్లా కోటిరెడ్డి కూడలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వివేకానంద నగర్​కు చెందిన రామచంద్రారెడ్డి పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంలో బయలుదేరాడు. కోటిరెడ్డి కూడలి సమీపంలో ఆటోల కోసం ప్రత్యేకంగా వేసిన ఇనుప బారికేడ్లు తగిలి కిందపడ్డాడు. అదే సమయానికి అటు వైపు నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు అతని తలపై నుంచి వెళ్లడం వలన రామచంద్రారెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

కడప జిల్లా కోటిరెడ్డి కూడలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వివేకానంద నగర్​కు చెందిన రామచంద్రారెడ్డి పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంలో బయలుదేరాడు. కోటిరెడ్డి కూడలి సమీపంలో ఆటోల కోసం ప్రత్యేకంగా వేసిన ఇనుప బారికేడ్లు తగిలి కిందపడ్డాడు. అదే సమయానికి అటు వైపు నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు అతని తలపై నుంచి వెళ్లడం వలన రామచంద్రారెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి :

చీరాలలో 'చీరల' దొంగలు అరెస్ట్

Intro:తూర్పుగోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గంలో నీట మునిగిన పంట పొలాలు


Body:కరుణించాల్సిన వరుణ దేవుడు రైతన్నలను కాటేశాడు. దీనికి ఎగువ ప్రాంత వరద తోడవటంతో వారికి కష్టాలు తప్పలేదు. తూర్పు గోదావరి జిల్లా లోని ప్రత్తిపాడు, కిర్లంపూడి, గొల్లప్రోలు మండలాల్లో అతివృష్టితో పాటు ఏలేరు జలాశయం నిండి దిగువకు వదిలిన నీటి కారణంగా వరి పంట పొలాలు నీటమునిగాయి. వందల ఎకరాల్లో సాగు చేసిన వరి చేతికి రాకుండా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
vo1: తూర్పుగోదావరి జిల్లా మెట్ట ప్రాంతంలో అత్యధికంగా వరి సాగు చేశారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు,ఏలేరు నుంచి దిగువకు వదిలిన జలాలు రైతులను తీవ్రంగా దెబ్బ కొట్టాయి. సరిగ్గా వరి పొట్ట దశలో ఉన్నప్పుడు వరదలు రావడంతో వందల ఎకరాలు నీట మునిగి సాగుకు పనికి రాకుండా పోయిందని రైతులు అంటున్నారు. దీంతో పెట్టిన పెట్టుబడి పూర్తిగా నష్టపోయామని వారు వాపోతున్నారు. ఒక ఎకరానికి 25 వేల రూపాయల పెట్టుబడి పెట్టామని రూపాయి దిగుబడి రాకుండా వరదలో తెలిపోయిందని కన్నీరు పెట్టుకున్నారు. ఇందులో ఎక్కువగా కౌలు రైతులు ఉండగా ఎకరానికి 12 బస్తాలు కౌలు తీసుకుంటున్నారు. దీంతో వారికి ఏమీ మిగలకుండా పోయింది.
vo2: ఏలేరు జలాశయం నీటి సామర్థ్యం 24.11tmcలు కాగా ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద రావడంతో పూర్తిస్థాయిలో నిండింది. సుమారు 9 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో పంట పొలాలు నిండా మునిగాయి. కిర్లంపూడి లోని రాజుపాలెం వద్ద గండి పడే అవకాశం ఉండటంతో రైతులు ఇసుక బస్తాలు వేసి అడ్డుకుంటున్నారు. ఒకవేళ గండి పడితే దాదాపు 300 ఎకరాలు ముంపునకు గురవుతాయని అంటున్నారు.
evo: పంట మొత్తం నష్టపోయామని రైతులు వాపోతున్నారు
శ్రీనివాస్,ప్రత్తిపాడు,617,ap10022
ప్రవీణ్,ejs student


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.