కడప జిల్లా కమలాపురం మండలం పొడదుర్తి గ్రామంలో ఓబులేసు అనే గొర్రెల కాపరి విద్యుదాఘాతంతో మృతిచెందాడు. కాజీపేట మండలం తిప్పాయపల్లె గ్రామానికి చెందిన ఓబులేసు.. 3 నెలల క్రితం గొర్రెలతో పొడదుర్తి గ్రామానికి వెళ్లాడు. గొర్రెల మేత కోసం ఆకు కోయడానకి చెట్టు ఎక్కిన అతనికి ప్రమాదవశాత్తు కరెంటు తీగలు తగలడం వల్ల షాక్ కొట్టి మృతిచెందాడు. విషయం తెలుసుకున్న మృతుని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఘటనా స్థలానికి చేరుకున్న కమలాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: