కడప జిల్లా ప్రొద్దుటూరులో ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జిల్లాలోని రామేశ్వరానికి చెందిన నాగచంద్రుడు.. ప్రొద్దుటూరులోని ఓ బట్టల దుకాణంలో గుమస్తాగా పని చేసేవాడు. అయితే తాగుడుకు బానిసైన నాగచంద్రుడు.. తరచూ భార్యతో గొడవపడి కొట్టేవాడని.. భర్త వేధింపులు భరించలేక భార్య నెల రోజుల క్రితం ఈశ్వర్ రెడ్డి నగర్లోని తన పుట్టింటికి వెళ్లిందని స్థానికులు చెప్పారు. ఈ క్రమంలో భార్య పుట్టింటినుంచి రావట్లేదని మనస్తాపం చెందిన నాగచంద్రుడు.. బైపాస్ రోడ్డు సమీపంలోని తోటలో చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలపారు.
ఇదీ చదవండి..