బంగారం చోరీ చేసిన వ్యక్తికి 15 నెలలు జైలు శిక్ష - బద్వోలులో బంగారం చోరీ చేసిన వ్యక్తికి 15 నెలలు జైలు శిక్ష
ఓ ఇంట్లో బంగారాన్ని చోరీ చేసిన వ్యక్తికి కడప జిల్లా బద్వేల్ న్యాయస్థానం 15 నెలలు జైలు శిక్ష విధించింది. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం కరాటంపాడుకు చెందిన జీవరత్నం అనే వ్యక్తి.. బద్వేల్ కు చెందిన సుధామణి ఇంట్లో బంగారు గొలుసు చోరీ చేశాడు. ఈ ఘటనపై బాధితురాలు బద్వేల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసును విచారించగా.. నేరం రుజువైంది. న్యాయమూర్తి 15 నెలలు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.