కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దయనీయంగాఉంది. నియోజక వర్గంలో మొత్తం 9 ఉన్నతపాఠశాలలు,24 ప్రాథమిక పాఠశాలలు, ఒక ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో వేలాది మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే, పాఠశాలల్లో సౌకర్యాలు అంతంత మాత్రమే ఉండటంతో, విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఏ పాఠశాల చూసినా అనేక సమస్యలు దర్శనమిస్తున్నాయి. ఉపాధ్యాయులు, విద్యార్దులు చేసేది ఏమిలేక అలాగే సర్దుకుపోతున్నారు. చిన్నపాటి వర్షం కురిస్తే చాలు పాఠశాల ఆవరణమంతా నీటితో నిండిపోతోంది. తరగతి గదులు శిథిలావస్థకు చేరి పెచ్చులు ఉడుతున్నాయి. ఈ గదుల్లోనే విద్యార్ధులు బిక్కుబిక్కుమంటూ చదువులు కొనసాగిస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవటం లేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఇకనైనా అధ్వాన స్థితిలో ఉన్న పాఠశాలలను బాగు చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటే విద్యార్థులు శ్రద్ధగా చదువుకుంటారని ఉపాధ్యాయులు కోరుతున్నారు.
ఇదీ చదవండి:అదృశ్య హస్తం... పార్కుల్లో విధ్వంసం...