కడప నగరపాలక సంస్థ పరిధిలో 90 శాతం ఇంటింటీ సర్వే పూర్తయిందని కమిషనర్ లవన్న తెలిపారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గ్రామ వాలంటీర్ వ్యవస్థ ద్వారానే ఈ ప్రక్రియ పూర్తయిందన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో 1,725 మంది వాలంటీర్ల నియామకం జరిగితే... ఇప్పటికే వివిధ కారణాలతో 300 మంది ఉద్యోగం మానేశారని అధికారులు వెల్లడించారు. ఇంటి యజమానికి సంబంధించిన బ్యాంకు ఖాతా నంబరు... వాలంటీర్లు నమోదు చేసుకున్నా ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపారు.
ఇదీ చూడండి: సమస్యలకు నిలయం.. బాలుర వసతి గృహం