ETV Bharat / state

స్మగ్లర్ల ఆట కట్టించిన పోలీసులు.. రూ.4 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం - red sandalwood smugglers arrested latest news update

ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడంలో కడప జిల్లా పోలీసులు ముందడుగు వేశారు. 4 కోట్ల రూపాయల విలువైన దుంగలు స్వాధీనం చేసుకోవడం సహా.. 30 మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు.

4 crore worth of red sandalwood seized
4 కోట్ల ఎర్రచందనం స్వాధీనం
author img

By

Published : Dec 2, 2020, 2:21 PM IST

4 కోట్ల ఎర్రచందనం స్వాధీనం

కడప జిల్లాలోని మైదుకూరు, రాజంపేట నియోజకవర్గాల్లో ఏకంగా 4 కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకోవడం సహా.. 30 మంది ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడిన వారిలో అంతర్రాష్ట్ర స్మగ్లర్లు ఖలీల్‌ఖాన్‌, అఫ్రోజ్‌ ఖాన్‌ ఉన్నారు.

జిల్లా నుంచి దుంగలను బెంగళూరుకు తరలిస్తుండగా గుర్తించిన పోలీసులు 9 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణాను అడ్డుకున్నారు. బెంగళూరు నుంచి విదేశాలకు ఎర్రచందనం తరలిపోతోందని గుర్తించినట్లు ఎస్పీ అన్బురాజన్‌ వెల్లడించారు. మరికొందరు బడా స్మగ్లర్ల కోసం గాలిస్తున్నామని చెప్పారు.

ఇవీ చూడండి:

తుపానుకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఎంపీ అవినాష్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.