ఈనెల 7న రైల్వేకోడూరు నియోజకవర్గంలోని చక్రంపేట మద్యం దుకాణంలోని క్యాషియర్‌గా పనిచేస్తున్న చినబాబు తనపై దాడి చేసి 3 లక్షల 50 వేల రూపాయలను దుండగలు ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఘటనపై పోలీసులు విచారణ చేస్తే చినబాబు కావాలనే దోపిడీ నాటకం ఆడినట్లు దర్యాప్తులో తేలింది. నిజం తెలుసుకున్న పోలీసులు నివ్వెరపోయారు.
చినబాబుతో పాటు కార్తీక్, కోనేటి శివ, గాలి రమణయ్య అనే నలుగురు వ్యక్తులు ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నట్లు తెలుసుకున్నారు. రవాణాకు అవసరమైన డబ్బు కోసం చినబాబుపై దాడి చేసినట్లు, డబ్బు ఎత్తికెళ్లినట్లు నాటకం ఆడినట్లు గుర్తించారు. తీగ లాగితే డొంక కదిలినట్లు.. చినబాబుతో సహా ఎర్రచందనం అక్రమ రవాణకు పాల్పడుతున్న 13 మంది స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. వారి నుంచి 28 ఎర్రచందనం దుంగలు, ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. పెనగలూరు, పుల్లంపేట మండలాల పరిధిలోని అడవుల్లో ఎర్రచందనం చెట్లను నరికి... ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తున్న జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు.
ఇవీ చదవండి: వివేకా హత్యకేసు: పులివెందుల కోర్టులో సీబీఐ పిటిషన్