కడప జిల్లాలో సోమవారం సాయంత్రం ఉరుములుతో కూడిన వర్షం కురిసింది. గాలివీడు మండలం పందికుంటలో పొలం వద్ద మేస్తున్న పొట్టేళ్లపై పిడుగు పడింది. గ్రామానికి చెందిన ధర్మారెడ్డి... మరో ఇద్దరు రైతులకు చెందిన 25 పొట్టేళ్లు అక్కడికక్కడే మృతి చెందాయి. రైతులు తీవ్రంగా నష్టపోయామని వాపోయారు. విషయం తెలుసుకున్న పశుసంవర్ధక శాఖ, రెవెన్యూ, పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని మృతి చెందిన పొట్టేళ్లను పరిశీలించారు.
బాధిత రైతులను ఆదుకుంటామని తెలిపారు. పొట్టేళ్లకు పంచనామా నిర్వహించారు. పరిహారం మంజూరు చేసేందుకు కృషి చేస్తామన్నారు. వాటికి బీమా సౌకర్యం ఉండటం వల్ల ఒక్కో జీవానికి రూ 6 వేల చొప్పున పరిహారం వస్తుందని రాయచోటి పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు గుణశేఖర్ తెలియజేశారు.
ఇదీ చదవండి: