కడప జిల్లా వేంపల్లి పాపాగ్ని నది నుంచి ఇసుకను ఎడ్ల బండ్లపై అక్రమంగా తరలిస్తుండగా పులివెందుల స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. ఇసుకను తరలించటానికి సిద్ధంగా ఉన్న 11 ఎడ్ల బండ్లను, యజమానులను అరెస్ట్ చేసి వేంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
అనుమతులు తీసుకోకుండా పాపాగ్ని నది నుంచి సొంత పనుల పేరుతో ఇసుకను తరలించి విక్రయాలు జరుపుతున్నారని పులివెందుల ఎస్ఈబీ అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆదాయానికి ఇలా ఎవరైనా గండి కొడితే ఉపేక్షించేది లేదని.. కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: