చెడు వ్యసనాలకు బానిసైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని ఎంఆర్సీ కాలనీకి చెందిన జ్ఞాన ప్రకాష్ అనే యువకుడు తల్లిదండ్రులు చనిపోవడంతో అమ్మమ్మ వాళ్ళ ఇంటి సమీపంలో సోదరుడితో కలిసి జీవిస్తున్నాడు. చెడు వ్యసనాలకు బానిసై... ఒంటరితనాన్ని భరించలేక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనాస్థలానికి చేరుకున్న రెండో పట్టణ ఎస్ఐ కిషోర్ బాబు వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇవీ చదవండి