గుజరాత్ బంగాళదుంప కర్షకులపై లేస్ కంపెనీ పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ.. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో రైతు సంఘం నిరసన ర్యాలీ చేపట్టింది. పెప్సీ, లేస్ కంపెనీలను బహిష్కరించి అన్నదాతలను ఆదుకోవాలని రైతులు కోరారు. ప్రభుత్వాలు స్వదేశి వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహించటం లేదని ఆవేదన చెందారు. విత్తన చట్టాలని చేతుల్లోకి తీసుకునే కార్పోరేట్ కంపెనీలకు..ప్రభుత్వం సహకరిస్తోందని మండిపడ్డారు. అలాంటి పరిశ్రమలపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.
ఇవీ చదవండి...సమస్యల పరిష్కారానికి రోడ్డెక్కిన రైతు