ETV Bharat / state

రఘురామకృష్ణరాజుపై లోక్​సభ స్పీకర్​కు వైకాపా ఫిర్యాదు - ఎంపీ రఘరామకృష్ణ రాజుపై వైకాపా ఫిర్యాదు

ycp-mps-met-speaker-om-prakash-birla-and-complaint-on-mp-raghu-rama-krishna-raju

author img

By

Published : Jul 3, 2020, 3:09 PM IST

Updated : Jul 3, 2020, 5:05 PM IST

15:06 July 03

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు వ్యవహారం దిల్లీకి చేరింది. శుక్రవారం ఉదయం ప్రత్యేక విమానంలో దిల్లీకి వెళ్లిన వైకాపా నేతల బృందం... మధ్యాహ్నం 3 గంటల సమయంలో లోక్​సభ స్పీకర్ ఓం బిర్లాను పార్లమెంట్‌లో కలిసింది. వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. స్పీకర్ ఓం బిర్లాను విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, నందిగం సురేశ్, లావు శ్రీకృష్ణదేవరాయలు కలిశారు.

మరోవైపు తనపై అనర్హత వేటు, సస్పెన్షన్ చర్యలు అడ్డుకోవాలని ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించారు. తాను ఎలాంటి పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడలేదని పేర్కొన్నారు. తనకు యువజన శ్రామిక రైతు పార్టీ తరఫున షోకాజ్ నోటీసులు ఇవ్వలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. రఘురామకృష్ణరాజు పిటిషన్‌ను హైకోర్టు సోమవారం విచారించే అవకాశం ఉంది.

Last Updated : Jul 3, 2020, 5:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.