ఓట్ల తొలగింపు విషయంలో తమను అన్యాయంగా కేసులో ఇరికిస్తున్నారని... పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో వైకాపా నాయకులు పోలీస్స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. మొత్తం 25 మంది అనుమానితులను పోలీస్ స్టేషన్ పిలిపించి ఎస్సై విచారణ చేశారు. వారి నుంచి రాతపూర్వకంగా వివరాలు తీసుకున్నారు. విషయం తెలుసుకున్న వైకాపా నాయకులు స్టేషన్కు వచ్చి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం కావాలని తమపై కుట్ర పన్నుతోందని ఆరోపించారు.
ఇవీ చదవండి..