ETV Bharat / state

సర్పంచి ఛాంబర్​కు తాళం.. వార్డు సభ్యుల ఆందోళన - ముక్కామల పంచాయతీలో రాజకీయ రగడ

పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు అధికారాలు చేపట్టకముందే పలు గ్రామాల్లో రాజకీయ రగడ రాజుకుంటుంది. సర్పంచ్ పదవి, వార్డులు స్థానాలు వేరువేరు పార్టీల మద్దతుదారులకు దక్కడంతో ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయి. సర్పంచిగా గెలిచిన వ్యక్తి పంచాయతీ కార్యాలయంలోని సర్పంచి ఛాంబర్ గదికి తాళం వెసుకున్నారని పేర్కొంటూ.. వార్డు సభ్యులు నిరసన చేపట్టారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలం ముక్కామల గ్రామంలో జరిగింది.

mukkaamala panchayat word members protest
ముక్కామల పంచాయతీలో రాజకీయ రగడ
author img

By

Published : Feb 23, 2021, 8:38 PM IST

పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలం ముక్కామల గ్రామంలో ఈనెల 13న జరిగిన ఎన్నికల్లో వైకాపా మద్దతుదారులు కేతా త్రిమూర్తులు సర్పంచిగా ఎన్నికయ్యారు. గ్రామంలో 10 వార్డుల్లో తెదేపా మద్దతుదారులు వార్డు సభ్యులుగా గెలుపొందారు. వీరు ఎన్నికకు సంబంధించి అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ రావాల్సి ఉంది.

సోమవారం పంచాయతీ కార్యాలయంలోని సర్పంచి ఛాంబర్​కు వచ్చిన త్రిమూర్తులు.. తిరిగి వెళ్లెప్పుడూ ఆ గదికి తాళం వేసుకొని వెళ్లారు. అయితే తెదేపా మద్దతుతో గెలిచిన వార్డుసభ్యులు ఈ రోజు కార్యాలయానికి వచ్చారు. సర్పంచి ఛాంబర్ గదికి తాళం ఉండటంతో నిరసన వ్యక్తం చేశారు. సర్పంచి వైఖరికి నిరసనగా కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.

అప్పటివరకు వాళ్లు పాలకవర్గ సభ్యులే కారు..

పాలకవర్గం అధికారాలు చేపట్టడానికి గెజిట్ నోటిఫికేషన్ రావాల్సి ఉందని మండలస్థాయి అధికారులు చెబుతున్నారు. అప్పటివరకు వాళ్లు అధికారిక పాలకవర్గ సభ్యులు కాలేరని స్పష్టం చేశారు. ఛాంబర్​కు తాళం వేయడం, తాళం తీసుకెళ్లారని నిరసన వ్యక్తం చేయడం రెండు సమంజసం కాదన్నారు.

ఇదీ చూడండి: వైకాపా అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.