ETV Bharat / state

గొడవపడి భార్యతో విడిపోయాడు... మరో పెళ్లి చేసుకుందని చంపేశాడు...

తాళి కట్టిన భర్తే ఆ మహిళ పాలిట కాలయముడయ్యాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట మనస్పర్థలతో విడిపోయారు. దీంతో మహిళ మరొకరిని పెళ్లి చేసుకుంది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని మొదటి భర్త ఆమెను కడతేర్చాడు.

women killed by her husband
హత్యకు గురైన మహిళ
author img

By

Published : Dec 18, 2020, 6:17 PM IST

పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం జట్లపాలెం వద్ద వివాహిత దారుణ హత్యకు గురైంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గణపవరం మండలం మొయ్యేరు గ్రామానికి చెందిన దువ్వాడపు చంద్రిక(32), చిలకపాడుకు చెందిన చంటి ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాక గత ఆరు నెలలుగా విడివిడిగా ఉంటున్నారు. చంద్రిక గణపవరానికి చెందిన మరో వ్యక్తిని ప్రేమించి పెళ్లాడింది.

దీన్ని తట్టుకోలేని మొదటి భర్త ఆమెను చంపేయాలనుకున్నాడు. పథకం ప్రకారం చంటి తన స్నేహితులతో కలిసి పెంటపాడు వస్తున్న చంద్రికను జట్లపాలెంరోడ్డులో అడ్డగించారు. అక్కడ వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

చంద్రిక ఎదురు సమాధానంతో తీవ్ర ఆగ్రహానికి గురైన చంటి... కత్తితో ఆమె మెడపై దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. భార్యను హతమార్చిన చంటి నేరుగా పెంటపాడు పోలీస్​స్టేషన్​కు వెళ్లి లొంగిపోయాడు.

ఇదీ చదవండి: ఓ ప్రేమ కథ... మూడు ప్రాణాలు... ఎన్నో మలుపులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.