పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బైపాస్ రోడ్డులోని యనమదుర్రు డ్రైన్ లోకి దూకి ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినా అప్పటికే నీటిలో గల్లంతయింది. ఆ మహిళను భీమవరం మెంటే వారి తోటకు చెందిన ఇంటి లక్ష్మిగా గుర్తించారు. ఈ చర్యకు కుటుంబ కలహాలే కారణం అని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి: