ETV Bharat / state

వనయాత్రలో విషాదం.. వాగులో పడి ఆరుగురు మృతి - పశ్చిమగోదావరి జిల్లా వసంతవాడ వాగులో ఆరుగురు యువకులు మృతి

six students died with Drowned in the river at in west godavari
వనయాత్రలో విషాదం.. వాగులో పడి ఆరుగురు మృతి
author img

By

Published : Oct 28, 2020, 11:35 AM IST

Updated : Oct 28, 2020, 5:22 PM IST

11:32 October 28

వేలేరుపాడు మండలం వసంతవాడలో విషాదం

వసంతవాడ వద్ద వాగులో ఆరుగురు విద్యార్థుల గల్లంతు

పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలం భూదేవిపేట శివారు వసంతవాడలో హృదయ విదారక ఘటన జరిగింది. సరదాగా ఈత కొట్టేందుకు వసంతవాడ వాగులోకి దిగిన ఆరుగురు యువకులు మృత్యువాత పడ్డారు. నవరాత్రులు ముగిసిన సందర్భంగా వేలేరుపాడు మండలం భూదేవిపేట గ్రామానికి చెందిన పలువురు వన భోజనాలు చేసేందుకు పెదవాగుకు వెళ్లారు. వాగులోకి దిగిన ఆరుగురు ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. సమాచారం తెలుసుకున్న స్థానిక ఎస్సై టి.సుధీర్‌ ఘటనాస్థలికి చేరుకున్నారు. గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. మధ్యాహ్నానికి మృత దేహాలను బయటకు తీశారు. కుక్కునూరు సీఐ బాల సురేశ్​ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.

మృతులు..

మృతులను.. శ్రీరాముల శివాజీ, గంగాధర్ వెంకట్​, కునరాల రాధాకృష్ణ, కర్నాటి రంజిత్, కెల్లా భువన్, గొట్టపర్తి మనోజ్​గా పోలీసులు గుర్తించారు. వీరిలో కొంతమంది ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు కాగా.. భువన్ వ్యవసాయ కోర్సు విద్యార్థి. వేలేరుపాడు విషాద ఘటనపై ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

నవరాత్రులు ముగిసిన సందర్భంగా బంధువులతో కలసి వాగు వద్దకు వెళ్లాం. భోజనాల ఏర్పాటు నిమిత్తం పనులు ముగించుకుని ఉదయం 10 గంటల సమయంలో ఆరుగురు యువకులు వాగులో దిగి ఆడుకుంటూ లోతు ప్రాంతానికి వెళ్లారు. లోతు ఎక్కువగా ఉండటం వల్ల ఒకరి తర్వాత ఒకరు మునిగారు. -బంధువులు

ఈ నెల 23న కుక్కునూరు మండలం బర్లమడుగు గ్రామంలోని చింతకుంటవాగులో స్నానానికి వెళ్లి ఇద్దరు చిన్నారులు చనిపోయారు. ఈ విషాద ఘటన మరువక ముందే మరో ఘటన జరగడం ఆందోళన కరం.

ఇదీ చదవండి:

రైతుల ఆర్థిక భద్రతే ప్రభుత్వ లక్ష్యం: సీఎం వైఎస్​ జగన్​

Last Updated : Oct 28, 2020, 5:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.