ETV Bharat / state

ఆయిల్​పామ్​ తోటల్లో వెంచర్​ విధానంతో లాభాలు... - Oil farm cultivation in West Godavari

వెంచర్ విధానంలో ఆయిల్​ పామ్​ తోటలకు ఎరువులు అందించడంతో రైతులు అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ఎరువులు ఖర్చు, కూలీల ఖర్చు తగ్గడంతో పాటు దిగుబడులు పెరగడంతో రైతులు ఈ విధానాన్ని ఎక్కువగా అవలంభిస్తున్నారు. మెుక్కకు అవసరమైనంత రసాయనాన్ని నేరుగా అందించటంతో పాటు.. ఎరువుల వృధాను అరికడుతున్నారు. గిట్టుబాటు ధరలు లేక ఆయిల్ పామ్ తోటలు తొలగించాలనుకున్న అన్నదాతలకు ఈ పద్ధతి లాభాలను అందిస్తోంది.

farmers are adopting venture approach
వెంచర్ విధానంలో లాభాల బాటలో ఆయిల్ ఫాం రైతులు
author img

By

Published : Dec 20, 2020, 7:28 PM IST

వెంచర్ విధానంలో లాభాల బాటలో ఆయిల్ ఫాం రైతులు

ఆయిల్ పామ్ తోటల్లో వెంచర్​ విధానాన్ని అవలంభిస్తూ... పశ్చిమ గోదావరి రైతులు లాభాలు గడిస్తున్నారు. ఈ విధానం ద్వారా ఎరువులు , నీటి వృధాను అరికట్ట వచ్చునని వ్యవసాయ పరిశోధకులు తెలుపుతున్నారు. క్షేత్ర స్థాయి పరిశోధనలు ద్వారా ఈ విధానాన్ని జాతీయ ఆయిల్ పామ్ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

పాత విధానం...

గతంలో ఆయిల్ పామ్ తోటలకు మూడు నెలలకు ఒకసారి ఎరువులను వేసేవారు. అయితే మెుక్కకు నీరు పెట్టాక... ఈ ఎరువులు అందులో సరిగా కరగక వృధా అయ్యేవి. మరో వైపు మొక్కకు అవసరమైన దానికంటే ఎక్కువ మొత్తంలో ఎరువు వేయడం వలన అవి తీసుకునేవి కాదు. దీంతో ఇటు ఎరువులు అటు నీరు పెద్ద మొత్తంలో వృధా అయ్యేది.

వెంచర్​ విధానం...

ఈ విధానంలో మోటారు వద్ద డ్రమ్మును ఏర్పాటు చేసి అందులో రసాయనాలను కరిగిస్తారు. ఎరువులు పూర్తిగా నీటిలో కరిగిన తర్వాత ఆ నీటిని రెండు అంగుళాల పైప్ ద్వారా మెుక్కకు నేరుగా చేరేలా చర్యలు చేపడతారు. పొలాలకు నీటిని అందించే డ్రిప్ ఇరిగేషన్​ పైపులతో పాటు వీటిని అమరుస్తారు. వీటి ద్వారా మెుక్కలకు నేరుగా రసాయనాలు అందించటం వల్ల వాటిని సులువుగా గ్రహిస్తాయి. ఈ విధానంలో గతంలో ఎకరాకు ఐదు బస్తాలు ఎరువులు వాడితే ప్రస్తుతం రెండున్నర బస్తాలు సరిపోతుందని అన్నదాతలు చెబుతున్నారు. సకాలంలో అన్ని అందించడంతో దిగుబడి కూడా గణనీయంగా పెరిగని పేర్కొన్నారు.

లాభాలు...

ఎకరానికి రెండు నుంచి నాలుగు టన్నుల వరకు దిగుబడి పెరిగినట్లు రైతులు తెలిపారు . గతంలో ఆయిల్ ఫామ్ తోటలో ఎరువులు వేయడానికి కూలీల అవసరం ఉండేదని... వారు లేక పోవటంతో సకాలంలో ఎరువులు వేయలేక పోయేవారమని అన్నారు. ప్రస్తుత ఈ విధానంలో కూలీల అవసరం లేనందున సమయానికి ఎరువులు అందిస్తున్నామని అన్నదాతలు వివరించారు. రైతులంతా ఈ పద్ధతిని అమలు చేస్తే ఎరువులు, నీరు ఆదాతో పాటు ఆయిల్ ఫామ్ లో అధిక దిగుబడులు సాధించవచ్చునని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

ఇదీ చదవండీ...

పది మంది పని.. చేసింది ఒక్కడే.. అదీ ఆరుపదుల వయసులో..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.