పశ్చిమగోదావరి జిల్లాలో రెండో రోజు లాక్డౌన్ పోలీసులు నియంత్రణతో పూర్తిస్థాయిలో అమలవుతోంది. జిల్లావ్యాప్తంగా కర్ఫ్యూ పరిస్థితి నెలకొంది. రహదారులు నిర్మానుష్యంగా మారాయి. నిత్యావసర దుకాణాలు మినహా మిగతా అన్ని షాపులు మూసివేశారు. ఏలూరుతోపాటు.. భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం పట్టణాల్లో రహదారులపై బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను పోలీసులు అడ్డుకుంటున్నారు. నిత్యావసరాల దుకాణాలు సైతం ఉదయం పది గంటల తర్వాత మూసి వేయించారు పోలీసులు. జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ పకడ్బందీగా అమలు చేస్తున్నారు.
ఇదీ చదవండి : పోలీసుల పహారాలో తణుకు పట్టణం