అటవీ భూ వివాదం కోర్టు పరిధిలో ఉన్న సమయంలో ఆ భూమిని దున్నేందుకు స్థానికులు యత్నించడం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉద్రిక్తతకు దారితీసింది. టి. నర్సాపురం మండలం అల్లంచర్ల రాజుపాలెంలో 280 ఎకరాల భూమిని కొంతమంది ఆక్రమించి సాగు చేశారు. నాలుగేళ్ల క్రితమే అటవీశాఖ కోర్టును ఆశ్రయించగా.. తదుపరి విచారణ వరకు ఎవరూ భూమిలోకి వెళ్లొద్దని కోర్టు స్టే విధించింది.
ప్రభుత్వం మారిన తర్వాత స్థానిక నాయకుల అండతో కొంతమంది భూమిని సాగు చేసేందుకు ట్రాక్టర్లతో వెళ్లగా.. అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సిబ్బందిపై గ్రామస్థులు దాడికి యత్నించడం కలకలం రేపింది. బాధ్యులపై అటవీ శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదీచదవండి: ఔరా: మూడు టన్నుల పాత ఐరన్ స్క్రాప్‌తో 'జీపు' తయారీ