ETV Bharat / state

పల్లెకూ ఉంది ఓ బడ్జెట్‌ - PANCHAYAT ELECTIONS IN ELURU

పంచాయతీకి బడ్డెట్‌ ఏంటి?.. ఆర్థిక ప్రణాళిక ఎందుకు అనుకుంటున్నారా.. అక్కడే మనం పొరబడుతున్నాం. దేశ ఆర్థిక ప్రగతికి పల్లెలే పునాదులు. ఇక్కడి నుంచి అభివృద్ధి మొదలైతే దేశం పురోగతి చెందుతున్నట్లే.

పల్లెకూ ఉంది ఓ బడ్జెట్‌
పల్లెకూ ఉంది ఓ బడ్జెట్‌
author img

By

Published : Feb 3, 2021, 5:18 PM IST

పంచాయతీలకు వచ్చే స్థానిక ఆదాయాలతో పాటు ప్రభుత్వాల నుంచి వచ్చే ఆదాయ వనరులను సక్రమంగా వినియోగించుకుంటే అభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రణాళికాబద్ధంగా నిధులు వినియోగిస్తే పల్లెల్లో ప్రగతి పుష్పాలు పూయించవచ్చు.

ఆదాయ మార్గాలివీ..

పంచాయతీకి సొంతగా ఆదాయ వనరులున్నాయి. ఇంటి పన్ను మొదలుకొని కుళాయిల నిర్వహణ, చెరువులు, భూములు, భవనాలు.. ఇతర ఆస్తుల నుంచి ఆదాయం వస్తుంది. భూముల క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్‌ మొత్తంలో 7.5 శాతం ఆయా పంచాయతీలకు చేరుతుంది.

కేంద్రం నుంచి..: ఆర్థిక సంఘం నిధులొస్తాయి. ఉపాధి పథకంలో భాగంగా కూలీల పనిదినాలకు చేసిన ఖర్చులో 40శాతం నిధులు మళ్లీ వెనక్కి వస్తాయి. రహదారులు, మురుగు కాలువలు, ఇతర పనులకు మైనరు పంచాయతీలకు 90 శాతం, మేజరు పంచాయతీలకు 70 శాతం నిధులు విడుదల చేస్తారు. ్ట్ర తాగునీరు, వీధిదీపాలు, రహదారుల, వైద్యశాలలు.. ఇలా గ్రామాల్లో చేసే పనులకు నిధులు ఉంటాయి. వీటిలో సిబ్బంది వేతనాలు 30 శాతం, వీధిదీపాల నిర్వహణకు 15, పారిశుద్ధ్యం, ప్రజారోగ్యానికి 15, రహదారులు, డ్రైయిన్లు నిర్వహణకు 20, తాగునీటి సరఫరాకు 15, ఇతరాలకే 5 శాతం ఖర్చు చేయాలి. ్ట్ర ఆదాయాన్ని ఖర్చు చేసేందుకు సర్పంచి, కార్యదర్శికి ఉమ్మడిగా అధికారం ఉంటుంది. దీంతో పాటు విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆడిట్‌ లెక్కలు చూపించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది.

ప్రణాళికే ప్రగతి సూత్రం
పంచాయతీలకు జనాభాను బట్టి ఆదాయంలో హెచ్చుతగ్గులున్నా ఆదాయ మార్గాలు మాత్రం ఒకటే. ప్రణాళికబద్ధంగా వ్యవహరించిన గ్రామాలు ప్రగతి పథంలో ఉన్నాయి.

జీలుగుమిల్లి పరిధిలోని టి.గంగన్నగూడెం పంచాయతీలో దాదాపు అందరూ గిరిజనులే. 20 ఏళ్ల కిందట అప్పారావు అనే వ్యక్తి సర్పంచిగా ఎన్నికయ్యారు. అప్పటివరకూ ఉన్న పరిస్థితులకు భిన్నంగా ప్రజల్లో చైతన్యం తెచ్చారు. పంచాయతీ ఆదాయ మార్గాలతో పాటు ప్రజలకు ఉపాధి కల్పించే అంశాలపై దృష్టిపెట్టారు. పట్టుపరిశ్రమను ఏర్పాటు చేసి ప్రజలకు ఉపాధి కల్పించారు. రహదారుల నిర్మాణం, పారిశుద్ధ్యం నిర్వహణలో మెరుగైన మార్పులు తెచ్చారు. వీధిదీపాలను పక్కాగా నిర్వహించడంతో మిగిలిన పంచాయతీలకు కంటే తక్కువ విద్యుత్తు బిల్లు వచ్చింది. దీంతో పొదుపు కూడా ఆదాయమేనని ప్రజలకు అవగతమైంది. అప్పట్లో ఈ పంచాయతీకి జాతీయ స్థాయిలో పురస్కారం వచ్చింది.

బుట్టాయగూడెం పంచాయతీకి 2013లో కంగాల పోసిరత్నం సర్పంచిగా ఎన్నికయ్యారు. పంచాయతీకి ఆదాయం తెచ్చే అంశాలపై దృష్టి పెట్టారు. ఇదే సమయంలో చెత్త నుంచి సంపద సృష్టి కార్యక్రమం రావడంతో దాన్ని అందిపుచ్చుకున్నారు. సంపద కేంద్రంలో తయారైన ఎరువులను రైతులకు తక్కువ ధరలకు విక్రయించేవారు. ఇలా వచ్చిన ఆదాయాన్ని పంచాయతీ పురోగతికి వినియోగించారు. ఈ పంచాయతీని 2016లో దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ జాతీయ పురస్కారం వరించింది.

ఇవీ చదవండి: ఈ 'వింత' తేలేదెన్నడు.. చిక్కుముడి వీడేదెన్నడు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.